కొత్తిమీర చేపల పులుసు | Coriander Fish Curry Recipe in Telugu | Andhra Chepala Pulusu | Home Food

కొత్తిమీర చేపల పులుసు | Coriander Fish Curry Recipe in Telugu | Andhra Chepala Pulusu | Home Food

Description :

కొత్తిమీర చేపల పులుసు | Coriander Fish Curry Recipe in Telugu | Andhra Chepala Pulusu | Home Food
kottimeera chepala koora
fish curry recipe telugu
andhra fish curry
special fish curry recipe
indian food recipes in telugu
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు కొత్తిమీర చేపల పులుసు ఎలా ప్రిపేర్ chesukovalo చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
చేప ముక్కలు 8 – ఉల్లిపాయలు 2 – పచ్చి మిర్చి 4 – కొత్తిమీర పేస్టు 1 cup – అల్లం వెల్లుల్లి పేస్టు 1 tsp – ఉప్పు –కారం – పసుపు – నిమ్మకాయ – మెంతులు ½ tsp – జీల కర్ర పొడి ½ tsp – ధనియాల పొడి ½ tsp – ఆయిల్ 4 tsp – చింత పండు ఒక నిమ్మకాయ సైజు
తయారీ విధానం
ముందుగా ఉల్లిపాయలను మిక్సీ జార్ లో వేసి పేస్టు గా చేసుకోండి . అలాగే కొత్తిమీరను కూడా కొంచెం వాటర్ కలిపి పేస్టు గా చేసి పక్కన పెట్టుకోండి
ఇప్పుడొక బౌల్ లో కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు – ఉల్లిపాయ పేస్టు – అల్లం వెల్లుల్లి పేస్టు – 1 tsp ఉప్పు – కొంచెం పసుపు – 1 tsp కారం వేసి ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొండి
చివరిలో కొంచెం నిమ్మ రసం కూడా వేసి ముక్కలకి పట్టేలా కలిపి అర గంట సేపు పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తరువాత నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి వేసి కొంచెం సేపు వేయించండి
కలిపి ఉంచుకున్న చేప ముక్కలు కూడా వేసి మూత పెట్టి ఐదు నిమషాల పాటు మగ్గ నివ్వండి
తరువాత రెండు గ్లాసుల వాటర్ లో నాన బెట్టుకున్న చింతపండు రసం – కొత్తిమీర పేస్టు – మెంతులు – జీల కర్ర పొడి – ధనియాల పొడి – తగినంత కారం – ఉప్పు వేసి కలుపుకొని – స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి ఒక పది నిమషాల పాటు ఉడికించుకోండి
పులుసు దగ్గర వచ్చిన తరువాత కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
చూసారుగా చాల సింపుల్ రెసిపీ ఇది … ఒకసారి మీరు ట్రై చేసి నాకు feedback ఇవ్వండి
మరొక వీడియో తో మళ్ళీ కలుద్దాం thank you

#corianderfishcurry #recipe #telugu


Rated nan

Date Published 2021-01-25 04:42:57
Likes 0
Views 14
Duration 3:56

Article Categories:
Andhra · Curry Recipes · Fish · Non-Vegetarian · Sea food · South Indian · Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..